|
|
కార్పోరేటర్ల నిరసనల మధ్య జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. కార్పోరేటర్ల నిరసన మధ్యే వార్షిక బడ్జెట్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆమోదం తెలిపారు. ఎలాంటి చర్చ లేకుండానే వార్షిక బడ్జెట్ కు మేయర్ ఆమోదించారు. మేయర్ పోడియం వద్దకు చేరుకుని నిరసన చేస్తున్న బిఆర్ఎస్ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అధికారులు వారిని బయటకు పంపించి వేశారు.